దేశంలోని ప్రముఖ టెలికాం సంస్థల్లో ఒకటైన ఎయిర్‌టెల్.. మరొక కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌ను లాంఛ్ చేసింది. రూ. 279 తో వస్తున్న ఈ ప్లాన్ వ్యాలిడిటీ 45 రోజులుగా ఉంది. ఇప్పటికే ఈ ప్లాన్‌ను వెబ్‌సైట్, మొబైల్ యాప్స్‌లో రీఛార్జ్ కోసం అందుబాటులోకి తీసుకొచ్చారు. అయితే దాదాపుగా ఈ ధరల్లో ఉన్న రీఛార్జ్ ప్లాన్లకు పరిమితి 30 రోజులుగానే ఉంటుండగా.. ఇప్పుడు దీనిని తక్కువ ధరలోనే ఎక్కువ వ్యాలిడిటీ ఇచ్చేలా దీనిని రూపొందించారు. ఇప్పటికే ఈ తరహా ప్రయోజనాలతో రూ. 395 చెల్లిస్తే 70 రోజుల వ్యాలిడిటీ ప్లాన్‌ను ఎయిర్‌టెల్ ఎప్పుడో తీసుకొచ్చింది.
ఎయిర్‌టెల్ రూ. 279 ప్లాన్ వివరాలు..
ఎయిర్‌టెల్ రూ. 279 ప్లాన్ రీఛార్జ్ చేసుకున్న వారికి మొత్తంగా 2జీబీ డేటా వస్తుంది. ఇది అయిపోయిన తర్వాత ఒక్కో ఏంబీ కి 50 పైసల చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్ ఉంది. 45 రోజుల్లో 600 ఎస్ఎంఎస్ లు వాడుకోవచ్చు. ఆ తర్వాత ఒక్కో మెసేజ్‌కు రూ.1 ఛార్జ్ చేస్తుంది. ఇంకా వీటితో పాటుగా అపోలో 24/7 సర్కిల్, ఫ్రీ హలోట్యూన్స్, వింక్ మ్యూజిక్ వంటి అదనపు ప్రయోజనాలు కూడా ఉన్నాయి. డేటా పెద్దగా ఉపయోగించకుండా.. కేవలం వ్యాలిడిటీ కోసం చూసేవారికి ఈ ప్లాన్ చక్కగా సరిపోతుంది.
2 నెలల కిందట ఎయిర్‌టెల్ ఓటీటీ సబ్‌స్క్రిప్షన్‌తో కలిసి మరో ప్రీపెయిడ్ ప్లాన్ అందుబాటులోకి తెచ్చింది. రూ. 699 రీఛార్జ్ ప్లాన్ ద్వారా అన్‌లిమిటెడ్ కాలింగ్, హై స్పీడ్ ఇంటర్నెట్ డేటా సహా 20కిపైగా ఓటీటీ సబ్‌స్క్రిప్షన్లు కూడా పొందొచ్చు.ఇక ఎయిర్‌టెల్ రూ. 699 రీఛార్జ్ ప్లాన్ ద్వారా అపరిమిత కాలింగ్, రోజువారీగా 3 జీబీ హైస్పీడ్ డేటాతో పాటు రోజుకు 100 ఎస్ఎంఎస్ వస్తాయి. ఇంకా 5G నెట్‌వర్క్ ఉన్న ప్రాంతాల్లో అన్‌లిమిటెడ్ డేటా వినియోగించుకోవచ్చు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 56 రోజులు. ఈ ప్లాన్‌తో అమెజాన్ ప్రైమ్ సహా ఎయిర్ టెల్ ఎక్స్ట్రీమ్ ప్లే సహా 20కిపైగా ఓటీటీ యాప్స్ వినియోగించుకోవచ్చు.