జరుగుమల్లి మండలం కామేపల్లి గ్రామంలో ప్రసిద్ధి చెందిన శ్రీ పోలేరమ్మ తల్లి బ్రహ్మోత్సవాలు గత మూడు రోజులుగా అత్యంత కన్నుల పండుగగా జరుగుతున్నాయి. పోలేరమ్మ తల్లిని దర్శించుకుని భక్తులు తమ మొక్కులు తీర్చుకుంటున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక అభిషేక పూజలు నిర్వహించారు. అలాగే శనివారం రాత్రి గ్రామస్థులు ఏర్పాటు చేసిన విద్యుత్ ప్రభలు, సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.