తాడిపత్రి మండల పరిధిలోని చిన్నపొడమల గ్రామంలో అతి పురాతనమైన రెండు నందుల శివాలయం శ్రీ ఉమామహేశ్వర దేవస్థానంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. గురువారం జేష్ఠ మాస శివరాత్రి సందర్భంగా గ్రామ పెద్దల సమక్షంలో శ్రీ ఉమామహేశ్వర స్వామి వారికి అభిషేకాలు, బిల్వార్చన చేశారు. అనంతరం భజనలు, పలు సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టారు.