సుండుపల్లె మండల పరిధిలోని జీకే రాచపల్లి ఉత్తర భాగాన చెరువు దగ్గర వెలిసిన నాగారపమ్మ ఆలయంలో తిరుణాల ఉత్సవాలలో భాగంగా శనివారం ప్రత్యేక పూజలు అభిషేకములు నిర్వహించారు. ఉదయం అమ్మవారికి పూజలు అభిషేకములు నిర్వహించి సాయంత్రం భజన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఆదివారం ఉదయం మొక్కుబడులో భాగంగా బోనాల కార్యక్రమం ఏర్పాటు చేస్తారని కావున భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకోవాలని ఆలయ అర్చకులు కోరారు.