స్టాక్ మార్కెట్లు గురువారం నష్టాల్లో ముగిశాయి. ఆర్బీఐ వడ్డీ రేట్లను స్థిరంగా కొనసాగించడంతో ఉదయం లాభాల్లో కనిపించిన మార్కెట్లు... ఆ తర్వాత క్రమంగా నష్టాల్లోకి జారుకున్నాయి. సెన్సెక్స్ 582 పాయింట్లు నష్టపోయి 78,886 పాయింట్ల వద్ద, నిఫ్టీ 180 పాయింట్లు పడిపోయి 24,117 పాయింట్ల వద్ద ముగిసింది.ఆర్బీఐ రెపో రేటును స్థిరంగా కొనసాగిస్తున్నట్లు ప్రకటన చేసిన సమయంలోనే కాసేపు లాభాల్లో కనిపించింది.బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ క్రితం సెషన్ కంటే దాదాపు రూ.3 లక్షల కోట్ల మేర తగ్గింది. ఈ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ నిన్న రూ.448.6 లక్షల కోట్లు ఉండగా, ఈ రోజు రూ.445.8 లక్షల కోట్లకు తగ్గింది.నిఫ్టీ 50లో 41 స్టాక్స్ నష్టాల్లో ముగిశాయి. మైండ్ ట్రీ, గ్రాసీమ్, ఏషియన్ పేయింట్స్ టాప్ లూజర్స్‌గా నిలిచాయి. టాటా మోటార్స్, హెచ్‌డీఎఫ్‌సీ, ఎస్బీఐ లైఫ్ కంపెనీలు భారీ లాభాల్లో ముగిశాయి.