దేశీయ బులియన్ మార్కెట్లో శుక్రవారం బంగారం ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారట్స్ బంగారం తులం ధర రూ.400 తగ్గి రూ.72,750 వద్ద ముగిసింది. ఆల్ ఇండియా సరఫా అసోసియేషన్ గణాంకాల ప్రకారం బుధవారం తులం బంగారం ధర రూ.73,150 వద్ద స్థిర పడింది. స్వాతంత్య్ర దినోత్సవం దినోత్సవం సందర్భంగా గురువారం కమొడిటీ మార్కెట్లకు సెలవు. ఇక కిలో వెండి ధర రూ.800 పెరిగి రూ.84 వేలకు చేరుకుంది. బుధవారం కిలో వెండి ధర రూ.83,200 పలికింది.గ్లోబల్ మార్కెట్లోనూ కామెక్స్ గోల్డ్ లో ఔన్స్ బంగారం ధర 8.50 డాలర్లు పెరిగి 2500.90 డాలర్ల వద్ద స్థిర పడింది. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల వల్ల శుక్రవారం బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ కమొడిటీస్ సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ తెలిపారు. ఔన్స్ వెండి ధర స్వల్పంగా తగ్గి 28.66 డాలర్లు పలికింది.