టాటా అసెట్ మెనేజ్మెంట్ కంపెనీ మరో కొత్త స్కీమ్ తీసుకొస్తోంది. అదే టాటా నిఫ్టీ 200 అల్ఫా 30 ఇండెక్స్ ఫండ్. ఇది ఒక ఓపెన్ ఎండెడ్ ఫండ్ స్కీమ్. నిఫ్టీ 200 అల్ఫా 30 ఇండెక్స్‌లో పెట్టుబడులు పెడుతుంది. నిఫ్టీ 200 సూచీల్లో హై అల్ఫా విలువ గల టాప్ 30 కంపెనీల పని తీరును గమనిస్తూ ఇన్వెస్ట్‌మెంట్లు చేస్తుంటుంది. తమ పెట్టుబడిదారులకు రిస్క్ ఫ్రీ రిటర్న్స్ అందించాలనే లక్ష్యంగా ఈ కొత్త ఫండ్ ఆఫర్ తీసుకొస్తున్నట్లు టాటా మ్యూచువల్ ఫండ్ తెలిపింది. అయితే, హైరిటర్న్స్ వస్తాయన్న గ్యారెంటీ, వారంటీ ఏమీ ఉండదని పేర్కొంది.
టాటా మ్యూచువల్ ఫండ్ న్యూ ఫండ్ ఆఫర్ ద్వారా తీసుకొస్తున్న టాటా నిఫ్టీ 200 అల్ఫా 30 ఇండెక్స్ ఫండ్‌లో కనీస పెట్టుబడి రూ. 5000 గా కంపెనీ నిర్ణయించింది. ఆ తర్వాత ఎంతైనా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఈ కొత్త ఫండ్ ఆఫర్ సబ్‌స్క్రిప్షన్ ఆగస్టు 19, 2024న మొదలవుతోంది. సెప్టెంబర్ 2, 2024 వరకు సబ్‌స్క్రిప్షన్ పొందవచ్చు. అల్ఫా ఫ్యాక్టర్ ఆధారంగా ఈ ఫండ్‌ని కపిల్ మేనన్ నిర్వహిస్తారు. మార్కెట్ రిటర్నులకు మించి రాబడులు అందించే స్టాక్స్‌ని గుర్తించి, రిస్క్ ఫ్రీ రిటర్న్స్ వచ్చేందుకు ఆయన కృషి చేస్తారు. పర్ యూనిట్ ఆఫ్ రిస్క్ పై హై రిటర్న్స్ అందించే స్టాక్స్‌కి అధిక ప్రాధాన్యం ఇవ్వనున్నారు. దీని ద్వారా నిఫ్టీ 200 అల్ఫా 30 ఇండెక్స్ ఫండ్ మంచి పని తీరు కనబరుస్తుందని అంచనా వేస్తున్నారు.
ఈ కొత్త ఫండ్ లాంచ్ సందర్భంగా టాటా అసెట్ మేనేజ్మెంట్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ ఆనంద్ వరదరాజన్ కీలక వ్యాఖ్యలు చేశారు. అల్భాను అందించగల టాప్ 30 స్టాక్స్‌లను ఎంచుకోవడం ద్వారా నిఫ్టీ 200 ఇండెక్స్ అందించ గల రిటర్న్స్ కంటే అదనపు రాబడిని సంగ్రహించడమే ఈ ఫండ్ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. తమ ప్రొడక్ట్ పోర్ట్ ఫోలియోను నిర్మించాలనే ఉద్దేశంతో ఇది తమ వైపు నుంచి మరొక విభిన్నమైన ఆఫర్ అని అన్నారు. కస్టమర్ల పెట్టుబడి పోర్ట్ ఫోలియోను నిర్మించడం, వైవిధ్యపరచే విషయంలో ఇవి వారికి విలువను జోడిస్తాయని విశ్వసిస్తున్నామన్నారు.