మీరు బ్యాంకు లేదా పోస్టాఫీసుల్లో కేంద్ర ప్రభుత్వ పథకాల్లో పెట్టుబడులు పెడుతున్నారా. అయితే కచ్చితంగా ఈ మారిన రూల్స్ గురించి తెలుసుకుందాం. స్మాల్ సేవింగ్స్ పథకాలకు సంబంధించి కేంద్రం కొత్త రూల్స్ తీసుకొచ్చింది. అక్టోబర్ 1 నుంచి ఇవి అమలుకానున్నాయి. ఈ మేరకు తాజాగా ఆర్థిక వ్యవహారాల శాఖ, కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ కొత్త నిబంధనలు తీసుకొస్తున్నట్లు తాజాగా ఒక సర్క్యులర్ రిలీజ్ చేసింది. అందుకే మీరు కూడా సుకన్య సమృద్ధి అకౌంట్, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ వంటి ఈ చిన్న మొత్తాల సేవింగ్స్ స్కీ్మ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నట్లయితే తెలుసుకోవాల్సి ఉంటుంది.
ఈ పథకాల్ని కేంద్ర ప్రభుత్వమే ఆఫర్ చేస్తుందన్న సంగతి తెలిసిందే. ఇర్రెగ్యులర్ అకౌంట్లకు సంబంధించి తాజాగా కొత్త రూల్స్ తీసుకొచ్చింది. ముఖ్యంగా ఇర్రెగ్యులర్ ఎన్ఎస్ఎస్ అకౌంట్లు, ఇంకా పిల్లల పేర్లపై పీపీఎఫ్ అకౌంట్స్, ఒకటికి మించి పీపీఎఫ్ అకౌంట్స్, NRI పీపీఎఫ్ అకౌంట్ల పొడిగింపు, గ్రాండ్ పేరెంట్స్ ప్రారంభించిన సుకన్య సమృద్ధి ఖాతాల రెగ్యులరైజేషన్ వంటివి ఇందులో ఉన్నాయి.
>> ఒకటికి మించి పీపీఎఫ్ అకౌంట్స్ ఉంటే.. అప్పుడు ముందు ప్రారంభించిన అకౌంట్ కొనసాగిస్తారని చెప్పొచ్చు. ఇక తర్వాత తెరిచిన అకౌంట్‌ను తొలి ఖాతాతోనే విలీనం చేసుకోవాలి. రెండుకు మించి అకౌంట్లు ఉంటే వడ్డీ రాదు. వాటిని క్లోజ్ చేయాల్సి ఉంటుంది. లేకపోతే మొదటి అకౌంట్లోకి నగదు బదిలీ చేసుకోవాలి.
>> యాక్టివ్‌గా ఉన్న ఎన్ఆర్ఐ పీపీఎఫ్ ఖాతాలు సెప్టెంబర్ చివరి వరకు ఉంటాయి. వాటికి వడ్డీ వస్తుంది. తర్వాత మాత్రం రాదు. దీనికి పోస్టాఫీస్ సేవింగ్స్ అకౌంట్ వడ్డీ అంటే 4 శాతమే వర్తిస్తుంది. ఇక ఎస్ఎస్‌వై, పీపీఎఫ్ మినహాయించి.. పిల్లల పేరిట తెరిచిన స్మాల్ సేవింగ్స్ స్కీమ్ అకౌంట్‌మీద సాధారణ వడ్డీనే వస్తుంది.
>> మరోవైపు సుకన్య సమృద్ధి ఖాతాను గార్డియెన్స్‌కు బదులుగా గ్రాండ్ పేరెంట్స్ ఓపెన్ చేస్తే.. అప్పుడు గార్డియన్‌షిప్ బదిలీ చేసుకోవాలి. లేకపోతే లీగల్ గార్డియెన్‌కు ట్రాన్స్‌ఫర్ చేస్తారు. ఇంకా ఒక కుటుంబంలో రెండుకు మించి అకౌంట్లు ఉన్నా.. వాటిని క్లోజ్ చేసుకోవాలి. ప్రస్తుతం కేంద్రం.. సుకన్య సమృద్ధి, సీనియర్ సిటిజెన్స్ సేవింగ్స్ స్కీమ్, మంత్లీ ఇన్‌కం స్కీమ్, పీపీఎఫ్, కిసాన్ వికాస్ పత్ర ఇలా చాలానే ఉన్నాయి. సుకన్య సమృద్ధి పథకంలో అత్యధికంగా 8.20 శాతం వడ్డీ రేటు ఉండగా.. పీపీఎఫ్‌లో 7.10 శాతం వడ్డీ రేటు వస్తుంది. అయితే ఈ రెండు పథకాల్లో టాక్స్ బెనిఫిట్స్ పొందొచ్చు.