హైదరాబాద్కు చెందిన రిటైర్డ్ ఉద్యోగి నుంచి సైబర్ నేరస్థులు ఏకంగా రూ.13.26 కోట్లను కొల్లగొట్టారు. పోలీసుల ప్రకారం, కొందరు వ్యక్తులు ఓ రిటైర్డ్ ఉద్యోగికి స్టాక్ బ్రోకింగ్ కంపెనీల పేరుతో లింక్లు పంపి వాట్సాప్ గ్రూపులో చేర్చారు.
షేర్ల గురించి చెప్పి పెట్టుబడి కోసం బ్యాంకు ఖాతాలకు నగదు బదిలీ చేయించుకున్నారు. పెట్టుబడికి తొలుత లాభాలు చూపించడంతో పూర్తిగా నమ్మిన వ్యక్తి వారికి రూ.13.26 కోట్లు బదిలీ చేసి మోసపోయాడు.