ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఇటీవల వరదలు ముంచెత్తిన సంగతి విదితమే. ఈ విపత్తు నుంచి తేరుకోకముందే మరో తుఫాను హెచ్చరిక ఏపీ వాసులను ఆందోళనకు గురిచేస్తోంది.
ఈ నెలాఖరులో ఏపీకి తుఫాను ముప్పు పొంచి ఉన్నట్లు వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు. ఉత్తర, మధ్య బంగాళాఖాతం పరిసరాలలో ఈనెల 24వ తేదీన అల్పపీడనం ఏర్పడుతుందని ఇది తీవ్ర రూపం దాల్చి తుఫానుగా మారే అవకాశం ఉందని అంచనా వేసింది. ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.