2024PT5 అనే గ్రహ శకలం జాబిల్లిగా మారనుంది. ఈ నెల 29నుంచి నవంబరు 25 వరకూ భూమి చుట్టూ ప్రదక్షిణ చేయనుంది. అనంతరం భూగురుత్వాకర్షణ నుంచి విడిపోయి, తిరిగి అంతరిక్షంలోకి ఎగిరిపోతుంది.
అయితే చాలా ఎత్తులో, చిన్నగా ఉండటం వల్ల మన కళ్లతో గానీ చిన్న టెలిస్కోప్‌తో గానీ చూడలేం. పెద్ద టెలిస్కోప్‌లతో చూడొచ్చు. వర్ధమాన ఖగోళ శాస్త్రవేత్తలకిదో అరుదైన అవకాశంగా భావిస్తున్నారు.