డ్రాగన్ ఫ్రూట్ మూడు రకాల్లో లభిస్తుంది. ఎరువు చర్మంతో లోపల ఎర్రని గుజ్జు (హైలోసెరియస్ పాలిరైజస్), ఎర్రని తోలుతో లోపల తెల్లని గుజ్జు (హైలోసెరియస్ అన్‌డేటస్), పసుపు తోలుతో లోపల తెల్లని గుజ్జు (హైలోసెరియస్ మెగాలంథస్). ఈ పండ్ల పెంపకానికి అన్ని రకాల నెలలు అనుకూలం.
మురుగు నీరు పోయే సౌకర్యం గల ఇసుక నేలలు మంచివి. ఉదజని సూచిక 5.5 నుంచి 6.5 ఉన్న అధిక సేంద్రియ పదార్థం గల నేలలు ఈ మొక్కల పెరుగుదలకు అనుకూలం.