రంగారెడ్డి జిల్లా నందిగామ సమీపంలోని కాంసన్ హైజెన్ పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్తో మంటలు చెలరేగినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు ప్రాథమికంగా గుర్తించారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టారు. ఇతర పరిశ్రమలకు మంటలు వ్యాపించకుండా ప్రయత్నిస్తున్నారు.