విధుల్లో ఉన్న ట్రాఫిక్ ఎస్ఐని ఓ మహిళ చెప్పుతో కొట్టింది. సేలం జిల్లా శూరామంగళం ప్రాంతానికి చెందిన కార్తీక్ (43), ఈయన సోదరి కమలేశ్వరి (35), వీరి బంధువు మురళీకృష్ణన్ (28)లు తమ కారును సేలం కొత్త బస్టాండు వద్ద పార్క్ చేశారు.
కారును మరో చోట పార్కింగ్ చేసుకోవాలని విధుల్లో ఉన్న స్పెషల్ ఎస్ఐ శరవణవేలన్ సూచించారు. అయితే ఆయనతో వారు వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో ఆగ్రహించిన కమలేశ్వరి చెప్పు తీసుకుని ఎస్ఐను కొట్టింది.