ఓర్వకల్లు మండలంలోని జయరాజ్ ఇస్పాత్ స్టీల్ పరిశ్రమలో స్థానిక యువతకు 75 శాతం ఉపాధి అవకాశాలు కల్పించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జి. రామకృష్ణ డిమాండ్ చేశారు.
బుధవారం ఓర్వకల్లులోని స్టీల్ పరిశ్రమ వద్ద భూ నిర్వాసితుల కమిటీ ఆధ్వర్యంలో పెద్దఎత్తున నినాదాలు చేస్తూ రైతులు నిరుద్యోగ యువత రెండు గంటల పాటు ధర్నా నిర్వహించారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించకపోతే ఆందోళన తప్పదన్నారు.