నాగర్ కర్నూల్ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. వెల్దండ మండలం ఎంజి కాలనీ తండాలోని వ్యవసాయ పొలంలో అడవి పందులు రాకుండా కాపలా పడుకున్న రాత్లావత్ రాజు అనే యువకుడిని శుక్రవారం తెల్లవారుజామున గుర్తుతెలియని.
దుండగులు దారుణంగా హత్య చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని, పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కాగా, ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.