తమిళనాడులో దారుణం జరిగింది. కృష్ణగిరి జిల్లా హోసూరు కోర్టు వెలుపల కన్నన్ అనే న్యాయవాదిపై ఆనంద్‌కుమార్ అనే వ్యక్తి కత్తితో దాడి చేశారు. కోర్టు ఎదుటే.. న్యాయవాదులు, ప్రజలు చూస్తుండగానే విచక్షణారహితంగా కత్తితో దాడికి పాల్పడ్డాడు. దాడి అనంతరం హూనూరు రెండవ అదనపు జడ్జి ఎదుట లొంగిపోయాడు. తీవ్రంగా గాయపడిన కన్నన్‌కు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. వివాహేతర సంబంధమే దాడికి కారణమని తెలుస్తోంది.