ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఈరోజు సాయంత్రం ఏపీ కేబినెట్ భేటీ జరిగింది. ఈ సమావేశంలో మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలను తీసుకుంది. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు కేబినెట్ నిర్ణయం తీసుకుంది. క్రీడా, పర్యాటక నూతన విధానాలకు కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపింది.ఈ కేబినెట్ భేటీలో పర్యాటక ప్రాజెక్టులకు పరిశ్రమ హోదా కల్పించే ప్రతిపాదనపై చర్చించి ఆమోదించింది. జ్యుడిషియల్ ప్రివ్యూ రద్దు బిల్లుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఏపీ ఇన్ఫ్రా, ట్రాన్స్‌పరెన్సీ యాక్ట్ 2019 రిపీట్ చేయాలని ప్రతిపాదించారు. 2024-25 కొత్త క్రీడా పాలసీకి కేబినెట్ ఆమోదం తెలిపింది.పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో స్థానిక సంస్థల్లో చైర్మన్లపై అవిశ్వాసం పెట్టే అంశంపై చట్ట సవరణ బిల్లుకు ఆమోదం తెలిపింది. అవిశ్వాసం పెట్టే గడువును నాలుగేళ్ల నుంచి రెండేళ్లకు సవరించింది. డ్రగ్స్ నియంత్రణ కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్ పేరును ఈగల్‌గా మారుస్తూ కేబినెట్ తీర్మానం చేసింది