ఫెంగల్ తుఫాను కారణంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. అత్యధికంగా పుత్తూరులో 187 ఎంఎం వాన కురిసింది. సుళ్లూరుపేేటలో 15, నగరిలో 120, నాయుడుపేటలో 117, తిరుపతి సిటీలో 116, మరికొన్ని ప్రాంతాల్లో 87-110 ఎంఎం వర్షపాతం కురిసింది.
శనివారం అర్ధరాత్రి నుంచి తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా వర్షం పడుతోంది. ఇవాళ, రేపు కూడా ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.