ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాశి ఫలాలు (04-12-2024)

Astrology |  Suryaa Desk  | Published : Wed, Dec 04, 2024, 11:29 AM

మేష రాశి :
మేషరాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థముగా ఉన్నది. అనవసరంగా ఆందోళన పడతారు. బుద్ధిబలంతో వ్యవహరిస్తే ఆటంకాలు దూరమవుతాయి. ఎలాంటి పరిస్థితుల్లోను మనోధైర్యాన్ని కోల్పోరాదు. అనారోగ్య సమస్యలను అశ్రద్ధ చేయవద్దు. మీ విజయానికి మీరే బాటలు వేసుకుంటారు. మీరు అనుకున్న లక్ష్యాలను సులభంగా సాధించగలరు. ప్రతీ నిర్ణయాన్ని తీసుకునే ముందు కుటుంబ సభ్యుల సలహాలను తీసుకోవడం మంచిది. కుటుంబముతో ఆనందంగా గడుపుతారు. ఇష్ట దేవతారాధన చేయడం మంచిది. మేషరాశి వారు మరింత శుభ ఫలితాలు పొందటానికి శ్రీమహావిష్ణువును పూజిండండి. సంకటనాశన గణపతి స్తోత్రాన్ని పారాయణం చేయండి. విఘ్నేశ్వరాలయ దర్శనం మరింత మంచిది.

వృషభరాశి :
వృషభరాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉన్నది. విందు వినోదాల్లో పాల్గొంటారు. కుటుంబసౌఖ్యం. మీ మనోధైర్యంతో అన్ని కష్టాలను అధిగమించగలరు. భవిష్యత్తు ప్రణాళికలు వేస్తారు. అధికారుల సహకారముంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో శుభఫలితాలు అందుతాయి. సమాజంలో గుర్తింపు, గౌరవం పొందుతారు. వివాదాస్పద విషయాలకు దూరంగా ఉండటం మంచిది. వృషభరాశి వారు మరింత శుభ ఫలితాల కోసం శ్రీకృష్ణున్ని పూజించండి. శ్రీకష్నుడు అందించిన భగవద్గీత పారాయాణం చేయండి. గీతలో జ్ఞాన, కర్మ, ధ్యాన యోగాలను పఠించండి. విఘ్నేశ్వర ఆలయాన్ని దర్శించండి. గణేష అష్టకాన్ని పఠించడం మరింత మంచిది.

మిథనరాశి :
మిథునరాశి వారికి ఈరోజు శుభప్రదంగా ఉన్నది. ఆర్థిక వ్యవహారాలు సఫలీకృతమవుతాయి. ఆరోగ్యం అనుకూలించును. అధికారుల నుంచి సహకారాన్ని పొందుతారు. ప్రారంభించబోయే పనుల్లో విజయం సాధిస్తారు. ఇష్టమైన వారితో కాలాన్ని గడుపుతారు. స్నేహితులతో కలసి ముఖ్యమైన విషయాలను చర్చిస్తారు. శుభవార్తలు వింటారు. ఆస్తి పంపకానికి చేసిన ప్రయత్నాలు ఫలిస్తాయి. విందులు, వినోదాలు ఆనందాన్నిస్తాయి. మరిన్ని శుభఫలితాల కోసం మిథున రాశి వారు తులసీ దళాలతో శ్రీ మహా విష్ణువును పూజించాలి. విష్ణువు సహస్రనామ పరాయాణం చేయడం మంచిది.

కర్కాటకరాశి :
కర్కాటక రాశివారికి ఈరోజు మీకు అనుకూలంగా లేదు. అనవసర విషయాలతో కాలాన్ని వృథా చేయకండి. ప్రారంభించిన పనులను పూర్తి చేయడానికి చిత్తశుద్ధి చాలా అవసరం. నిరంతర శ్రమ వల్ల విజయాన్ని పొందుతారు. కుటుంబ సభ్యుల సహకారంతో ప్రధాన నిర్ణయాలు తీసుకోవటం మంచిది. కొన్ని సందర్భాల్లో ఇతరులు మీ మాటలను అపార్థం చేసుకునే అవకాశం ఉంది. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. సరైన ఆహారం, విశ్రాంతి తీసుకోవాలి. కర్కాటక రాశివారు మరింత శుభఫలితాలు పొందటానికి రామ చంద్ర మూర్తిని పూజించాలి. రామాయణం పారాయణంతో పాటు 108 సార్లు రామనామస్మరణ చేయడం శుభపలితాలను ఇస్తుంది.

సింహరాశి :
సింహరాశి వారికి ఈరోజు మీకు అనుకూలంగా లేదు. శారీరక శ్రమ అధికం. ప్రారంభించిన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. ముఖ్య విషయాల్లో పెద్దల సలహాలు, మద్దతు పొందుతారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. ఏదైనా అనుకోని సంఘటన బాధ కలిగించవచ్చు. ఆరోగ్య విషయంలో ప్రత్యే శ్రద్ధ వహించడం మంచిది. మీ పోరాట పటిమ మీకు విజయాన్ని అందిస్తుంది. గొడవలకు దూరంగా ఉండుట మంచిది. సింహరాశివారు మరింత శుభ ఫలితాలు పొందటానికి శ్రీరామ రక్షా స్త్రోత్రాన్ని పఠించండి. రామ జపం చేయడం మంచిది.

కన్యారాశి :
కన్యారాశి వారికి ఈరోజు అనుకూల ఫలితాలున్నాయి. వ్యాపారస్తులకు లాభదాయకం. కుటుంబ సభ్యులతో సంతోషంగా సమయాన్ని గడుపుతారు. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. కుటుంబ సభ్యుల అంగీకారంతో చేసే పనులు ఆశించిన దానికంటే గొప్ప ఫలితాలను ఇస్తాయి. పెట్టుబడులు లభించేందుకు అనుకూల సమయం. కుటుంబంతో చిన్నపాటి సమస్యలు వస్తాయి. అనవసరమైన పనులకు సమయాన్ని వృధా చేయకండి. కన్యారాశివారు మరింత శుభఫలితాలు పొందటానికి విష్ణు సహస్రనామం, భగవద్గీత పారాయాణం చేయడం మంచిది. విష్ణుమూర్తి ఆలయాలను దర్శించండి.

తులారాశి :
తులారాశి వారికి ఈరోజు మీకు అనుకూలంగా లేదు. మీమీ రంగాల్లో శ్రమ ఫలిస్తుంది. కీలక వ్యవహారాల్లో పెద్దలు మీకు అనుకూల నిర్ణయం తీసుకుంటారు. కుటుంబ సభ్యుల మాటలకు గౌరవం ఇవ్వడం మంచిది. కోపతాపాలకు పోకండి. చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి. ప్రయాణాల్లో జాగ్రత్తగా వ్యవహరించండి. మీ కృషి ద్వారా సమాజంలో గౌరవం మరింత పెరుగుతుంది. అవగాహనతో నిర్ణయాలు తీసుకోండి. తులారాశివారు మరింత శుభఫలితాలు పొందటానికి వినాయకుడిని, శ్రీకృష్ణుడిని పూజించండి. గణేశ స్తోత్రాన్ని పఠించండి.

వృశ్చికరాశి :
వృశ్చికరాశివారికి ఈరోజు మీకు అనుకూలంగా ఉన్నది. బంధుమిత్రులో ఆనందముగా గడుపుతారు. ఒక ముఖ్య విషయమై అధికారులను కలుస్తారు. ప్రారంభించిన కార్యక్రమాలు సత్ఫలితాలను అందిస్తాయి. అవసరమైనప్పుడు తగిన సహాయం అందుతుంది. అందరితో కలసిమెలసి వ్యవహరిస్తే విజయాన్ని త్వరగా అందుకుంటారు. మంచి భవిష్యత్తు కోసం చేసే ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. మీమీ రంగాల్లో చక్కటి శుభఫలితాలను అందుకుంటారు. వృశ్చికరాశివారు మరింత శుభఫలితాలు పొందటానికి శ్రీమహావిష్ణువును, గణనాథుడిని పూజించాలి. విఘ్నేశ్వరాలయ దర్శనం మరింత మంచిది.

ధనస్సు రాశి :
ధనూరాశివారికి ఈరోజు అనుకూలంగా ఉన్నది. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కీలక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. బంధుమిత్రులతో కలసి కొన్ని ముఖ్యమైప నిర్ణయాలు తీసుకుంటారు. పట్టుదలతో ముందుకు సాగి మీ లక్ష్యాలను అందుకుంటారు. కుటుంబ సభ్యుల సహకారముంటుంది. ప్రయాణాల్లో జాగ్రత్త పాటించడం మంచిది. ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. ధనూరాశివారు మరింత శుభ ఫలితాలు పొందటానికి దత్తాత్రేయున్ని పూజించండి. దత్తాత్రేయ స్తోత్ర పరాయాణం మంచిది. విష్ణు మూర్తి ఆలయం దర్శనం మంచిది.

మకరరాశి :
మకరరాశి వారికి ఈరోజు మీకు అనుకూల ఫలితాలున్నాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో శుభవార్తలు వింటారు. వ్యాపారపరంగా లాభాలున్నాయి. సమయపాలనతో పనులను పూర్తి చేస్తారు. ఒక శుభవార్త మీ ఇంట్లో ఆనందాన్ని ఇస్తుంది. సమాజంలో మీ కీర్తి మరింత పెరుగుతుంది. శుభ కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా ఆత్మ సంతృప్తిని పొందుతారు. ఉన్నత ఆలోచనలతో ముందుకు సాగండి. ఆరోగ్యం బలాన్ని ఇస్తుందని విశ్వసించండి. మకరరాశివారు మరింత శుభఫలితాలు పొందటానికి విష్ణు సహస్రనామాన్ని పఠించండి. కాలాభైరవాష్టకం పఠించండి. గురు దక్షిణామూర్తి స్త్రోత్ర పారాయణం చేయడం మంచిది.

కుంభరాశి :
కుంభరాశి వారికి ఈరోజు మీకు అనుకూలంగా ఉన్నది. ప్రారంభించిన పనిలో తోటివారి సహకారం లభిస్తుంది. ఆర్థికంగా పురోగతి ఉంటుంది. ఒక శుభవార్త ఆనందాన్ని ఇస్తుంది. మీ సేవలతో అందరి నుంచి మన్ననలు పొందుతారు. పెద్దల ఆశీస్సులతో మీ పనులు మరింత జయప్రదంగా ఉ ంటాయి. ఒక శుభవార్త మిమ్మల్ని సంతోషంలో నింపుతుంది. అనవసరమైన కష్టాలకు దూరంగా ఉండండి. కుంభరాశివారు మరింత శుభఫలితాలు పొందటానికి విష్ణుమూర్తిని పూజించాలి.

మీనరాశి :
మీనరాశి వారికి ఈరోజు మీకు అనుకూలంగా లేదు. వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో కొన్ని అడ్డంకులు ఎదురవుతాయి. కుటుంబంలో వివాదం ఏర్పడే అవకాశముంది. సమాజంలో గౌరవాన్ని పరిగణనలోకి తీసుకుని వ్యవహరించండి. గృహ నిర్మాణ పనులు అనుకున్నట్లు సాగకపోవచ్చు. కుటుంబ సభ్యుల సహకారం తీసుకోవడం మంచిది. బద్ధకాన్ని దరిచేరనీయకండి. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. ఇతరుల నుంచి అనుకోని విమర్శలు ఎదురుకావచ్చు. మీనరాశివారు మరింత శుభఫలితాలు పొందటానికి దత్తాత్రేయ స్తోత్ర పరాయాణం చేయాలి. విష్ణు మూర్తి ఆలయం దర్శనం మంచిది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com