సిద్దిపేట జిల్లాలో మరో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. దుబ్బాక మండలం హబ్సిపూర్ శివారులో గల మహాత్మ జ్యోతిరావు పూలే హాస్టల్ వద్ద ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్నాయి. ద్విచక్ర వాహనాలు ఢీకొనడంతో వాహనదారులకు తీవ్ర గాయాలయ్యాయి. ముగ్గురు తీవ్రంగా గాయపడటంతో వెంటనే హాస్టల్లో ఉపాధ్యాయులు 108 అంబులెన్స్ కు సమాచారం అందించారు.
108 సిబ్బంది హుటాహుటిన క్షతగాత్రులను సిద్దిపేట ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన చోటే ఉన్న హాస్టల్ కు విధుల నిమిత్తం వస్తున్న దుబ్బాక పట్టణానికి చెందిన ధర్మపురి అనే ఉపాధ్యాయుడికి తీవ్ర గాయాలు కావడం జరిగిందని హాస్టల్ ఉపాధ్యాయులు తెలిపారు. మరో ద్విచక్ర వాహనంపై ఉన్న ఇద్దరు ఎవరు అనే విషయం తెలియాల్సి ఉంది.