గ్రామాలు దేశానికి పట్టు కొమ్మలని, గ్రామాభివృద్ధి దేశానికి అభివృద్ధి అని ఒంటిమిట్ట మండల అభివృద్ధి అధికారి ప్రసాద్ అన్నారు. బుధవారం ఎంపీడీవో కార్యాలయంలో సచివాలయ సిబ్బందికి ఒకరోజు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాల్య వివాహాల నిర్మూలన ప్రధాన ధ్యేయమని, గ్రామాల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన కోరారు. కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
![]() |
![]() |