సౌత్ ఆఫ్రికా డేంజర్ బ్యాట్స్మెన్, సన్రైజర్స్ హైదరాబాద్ ప్లేయర్ హెన్రిచ్ క్లాసెన్ కు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. తాజాగా హెన్రిచ్ క్లాసెన్ కు ఫైన్ వేసింది అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ . గురువారం రోజున సౌత్ ఆఫ్రికా వర్సెస్ పాకిస్తాన్ జట్ల మధ్య రెండో వన్డే మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ కేప్ టౌన్ వేదికగా చాలా అట్టహాసంగా జరిగింది. ఈ మ్యాచ్ లో సౌత్ ఆఫ్రికా పై గ్రాండ్ విక్టరీ కొట్టింది పాకిస్తాన్ జట్టు. ఈ మ్యాచ్ లో సౌత్ ఆఫ్రికా వికెట్ కీపర్ హెన్రిచ్ క్లాసెన్ వర్సెస్ పాకిస్తాన్ ప్లేయర్ల మధ్య గొడవ జరిగిన సమితి తెలిసిందే. దీనికి సంబంధించిన న్యూస్ నిన్నటి వరకు వైరల్ అయింది. అయితే తాజాగ ఆ మ్యాచ్ రోజున… హెన్రిచ్ క్లాసెన్ చేసిన క్రమశిక్షణ రహిత పనికి ఫైన్ వేసింది అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ . ఈ రెండవ వన్డే మ్యాచ్ లో… తన వికెట్ పడిపోయిన తర్వాత… కీపర్ దగ్గర ఉన్న వికెట్లను గట్టిగా తన్నాడు హెన్రిచ్ క్లాసెన్. దీనికి సంబంధించిన ఫోటో అలాగే వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే దీనిపై… గ్రౌండ్ ఎంపైర్లు కూడా హెన్రిచ్ క్లాసెన్ కు అక్కడే వార్నింగ్ ఇచ్చారు. అయితే అక్కడితో ఈ వివాదం సమసి పోలేదు.
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్. హెన్రిచ్ క్లాసెన్ మ్యాచ్ ఫీజులో 15% కోత విధించింది ICC. లెవెల్ 1 ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్ ను హెన్రిచ్ క్లాసెన్ ఉల్లంఘించినట్లు స్పష్టం చేసింది అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్. అలాగే ఆర్టికల్ 2.2 ఐసీసీ కోడ్ ప్రకారం… గ్రౌండ్లో ఉన్న క్రికెట్ కు సంబంధించిన వస్తువులు అలాగే దుస్తులను అసలు దుర్వినియోగం చేయకూడదు. కానీ హెన్రిచ్ క్లాసెన్ ఆ రూల్ బ్రేక్ చేశాడు. దీంతో అతనిపై ఒక డిమెరిడ్ పాయింట్ విధించింది ఐసిసి.