మచిలీపట్నంలోని బందరు కోటలో వేంచేసి ఉన్న శ్రీ కోదండరామ స్వామి వారి దేవస్థానంలో మంత్రి కొల్లు రవీంద్ర సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్బంగా అర్చకులు స్వామివారికి మంత్రి పేరిట పూజలు చేశారు. ఈ సందర్బంగా ఆలయ అర్చకులు తీర్ధ ప్రసాదాలు పంపిణీ చేశారు. ఆలయ కమిటీ ప్రతినిధులకు మంత్రిని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు పాల్గొన్నారు.