రాష్ట్రంలో జరుగుతున్నది చంద్రబాబు పాలన కాదని... చంద్రబాదుడు పాలన అని వైయస్ఆర్సిపి నేతలు మండిపడ్డారు. విద్యుత్ చార్జీల పెంపు ద్వారా రాష్ట్ర ప్రజలపై ఏకంగా రూ.15,485 కోట్లు భారాన్ని మోపడం దుర్మార్గమని అన్నారు. దీనికి నిరసనగా వైయస్ఆర్ సిపి అధినేత వైయస్ జగన్ పిలుపు మేరకు ఈ నెల 27వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా తలపెట్టిన వైయస్ఆర్ సీపీ పోరుబాట కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ ను పార్టీ కేంద్ర కార్యాలయంలో మాజీ మంత్రులు మేరుగు నాగార్జున, వెల్లంపల్లి శ్రీనివాసరావు, జోగి రమేష్, ఎమ్మెల్సీలు లేళ్ళ అప్పిరెడ్డి, కల్పలతారెడ్డి తదితరులు ఆవిష్కరించారు.