ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇక హోటల్స్ తెరుచుకోనున్నాయ్.. కీలక నిర్ణయం ప్రకటించిన M. K. Stalin

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Mar 14, 2026, 11:38 PM

దేశవ్యాప్తంగా వంటగ్యాస్ కొరత తీవ్ర ఆందోళనకు దారితీస్తోంది. ముఖ్యంగా వాణిజ్య సిలిండర్ల సరఫరా తగ్గిపోవడంతో పలు నగరాల్లో హోటళ్లు, రెస్టారెంట్లు తాత్కాలికంగా మూసివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని Tamil Nadu ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.ముఖ్యమంత్రి M. K. Stalin అధ్యక్షతన జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో సీనియర్ అధికారులు పాల్గొని పలు చర్యలను నిర్ణయించారు. టీస్టాళ్లు, హోటళ్లు, రెస్టారెంట్లు, క్లౌడ్ కిచెన్లు వంటి ఆహార తయారీ కేంద్రాలు ఎల్పీజీకి బదులుగా ఎలక్ట్రిక్ స్టౌవ్‌లను వినియోగిస్తే వారికి ప్రత్యేక రాయితీ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.ఈ ప్రకారం ఒక యూనిట్ విద్యుత్‌పై రూ.2 సబ్సిడీ అందించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. వంటగ్యాస్ కొరత పరిస్థితి పూర్తిగా సద్దుమణిగే వరకు ఈ సబ్సిడీ కొనసాగుతుందని సీఎం తెలిపారు. ఈ నిర్ణయం హోటల్ రంగానికి తాత్కాలిక ఊరట కలిగించనుందని అధికారులు పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa