టెహ్రాన్ : దేశవ్యాప్తంగా వంటగ్యాస్ కొరతపై ఆందోళనలు నెలకొన్న సమయంలో భారత్‌కు ఊరటనిచ్చే పరిణామం చోటుచేసుకుంది. Iranతో జరిగిన చర్చల అనంతరం హర్మూజ్ జలసంధి మార్గంగా ప్రయాణించేందుకు భారత ఎల్పీజీ ట్యాంకర్లకు అనుమతి లభించింది.ఈ నేపథ్యంలో Strait of Hormuz మార్గంగా భారత్‌కు చెందిన ఎల్పీజీ నౌకలు ప్రయాణించేందుకు ఇరాన్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. భారత జెండా ఉన్న శివాలిక్, నందాదేవి అనే రెండు ఇంధన నౌకలు శనివారం హర్మూజ్ జలసంధిని విజయవంతంగా దాటాయి. ఈ జలమార్గంలో భారత్‌కు చెందిన సుమారు 28 నౌకలు చిక్కుకుపోయిన విషయం తెలిసిందే. శివాలిక్ నౌకలో దాదాపు 40 వేల మెట్రిక్ టన్నుల వంటగ్యాస్ ఉండగా, నందాదేవి నౌకలో కూడా భారీ పరిమాణంలో ఎల్పీజీ ఉన్నట్లు సమాచారం.భారత్ మా మిత్రదేశమని భారత్‌లో ఇరాన్ రాయబారిగా ఉన్న Mohammad Fattahi తెలిపారు. వ్యూహాత్మక ప్రాధాన్యత కలిగిన హర్మూజ్ జలమార్గం ద్వారా భారత నౌకలు సురక్షితంగా ప్రయాణించేలా చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. భారత్‌తో సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని తమ దేశం కోరుకుంటోందని కూడా స్పష్టం చేశారు. అదే సమయంలో తమ షరతులకు అంగీకరిస్తేనే యుద్ధాన్ని ముగిస్తామని, ఈ యుద్ధానికి కారణం అమెరికానే అని ఆయన వ్యాఖ్యానించారు.ఇక Kharg Islandలోని చమురు ఎగుమతి కేంద్రాల పరిస్థితిపై కూడా ఇరాన్ అధికారులు స్పందించారు. అమెరికా దాడుల తర్వాత కూడా అక్కడ ముడి చమురు ఎగుమతి–దిగుమతి కార్యకలాపాలు యథావిధిగా కొనసాగుతున్నాయని బుషెహర్ రాష్ట్ర డిప్యూటీ గవర్నర్ Ehsan Jahanian తెలిపారు. రోజువారీ కార్యకలాపాలు సాధారణంగానే కొనసాగుతున్నాయని, దాడుల్లో ఎవరూ మరణించలేదని చెప్పారు.మరోవైపు యుద్ధం 15వ రోజుకు చేరుకున్న నేపథ్యంలో దేశంలోని సాంస్కృతిక వారసత్వానికి నష్టం వాటిల్లినట్లు ఇరాన్ ప్రభుత్వం వెల్లడించింది. సుమారు 56 మ్యూజియంలు, అనేక చారిత్రక కట్టడాలు దెబ్బతిన్నాయని తెలిపింది. టెహ్రాన్‌లోని యునెస్కో గుర్తింపు పొందిన Golestan Palace కూడా దాడుల్లో దెబ్బతిన్నట్లు అధికారులు వెల్లడించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa