కళాకారులు ఒకరికొకరు సహాయ సహకారాలు అందించుకుంటూ ఐకమత్యంగా ఉంటే అ భివృద్ధి సాధించగలుగుతారని మూవీ ఆర్టిస్ట్ అసో సియేషన్(మా) ఏపీ అధ్యక్షుడు, సినీ నటుడు గౌతంరాజు పేర్కొన్నారు. ఆదివారం సాయంత్రం ఒంగోలులోని వీవీఎం డిగ్రీ కళాశాలలో మా ప్ర కాశం జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కా ర్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యా రు. ఈ సందర్భంగా గౌతంరాజు మాట్లాడుతూ తెలుగు రాష్ర్టాలు విడిపోయిన తర్వాత 2021లో మా ఆంధ్రప్రదేశ్ శాఖను ఏర్పాటు చేశారని, రా ష్ట్రవ్యాప్తంగా ఉన్న నటీనటులు, రచయితలు, ద ర్శకులు మొదలైన వారిని గుర్తించి వారికి సరైన అవకాశాలు లభించేవిధంగా కృషి చేస్తున్నామని చెప్పారు. ఇందుకోసం జిల్లాల వారీగా శాఖలను ఏర్పాటు చేసి, వాటి ఆధ్వర్యంలో ఆడిషన్స్ నిర్వ హిస్తున్నట్లు తెలిపారు. పేద కళాకారులకు ప్రభు త్వం నుంచి ఇళ్లస్థలాలు సాధించటం, అవసరమై న వైద్య సదుపాయాలు కోసం ఆర్థిక సహాయాన్ని అందించేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. ఇందుకోసం భవిష్యత్తులో ప్రతి జిల్లాలో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి కళాకారులను ప్రోత్సహిస్తామన్నారు. జిల్లా అధ్యక్షులు సతీష్ ఆ ధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో హాస్యనటుడు, రచయిత హరిబాబు, ప్రముఖ గాయకుడు ప్రదీ ప్ తదితరులు పాల్గొన్నారు. తర్వాత నిర్వహించిన నటన ఆడిషన్స్‌లో దాదాపు 30 మంది కళాకారులు పాల్గొని తమ నటనను ప్రదర్శించారు.