పులివెందుల మున్సిపాలిటీ అభివృద్ధికి సహకరించాలని రాష్ట్ర మున్సిపల్ శాఖా మంత్రి నారాయణను ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామగోపాల్‌రెడ్డి కోరారు. సోమవారం రాష్ట్ర సచివాలయంలో మంత్రి నారాయణను కలిసి పులివెందుల సమస్యలను వివరించారు. ము న్సిపాలిటీలో అనేక ప్రాంతాల్లో సరైన డ్రైనేజీ, రోడ్లు, తాగునీటి సరఫరా లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు.
నిధులు మంజూరు చేసినా పనులు చేయడంలో యంత్రాంగం పూర్తిగా వైఫల్యం చెందిందన్నారు. అనేక పనులు అసంపూర్తిగా నిలిచిపోయాయన్నారు. కొన్ని ప్రారంభం కూడా కాలేదన్నారు. పులివెందుల మున్సిపాలిటీలో వివిధ అభివృద్ధి పనులు చేయడానికి అత్యవసరంగా రూ.ఐదు కోట్ల నిధులు మం జూరు చేయాలని కోరారు.