నెల్లూరు జిల్లా జొన్నవాడ రోడ్డులో ట్రాన్స్ జెండర్ రూపంలో దెయ్యం తిరుగుతుందనే పుకార్లు జిల్లా మొత్తం వ్యాపించాయి. ఇటీవల ఓ యుడకుడిపై దెయ్యం దాడికి పాల్పడిందని, నెల్లూరులోని ఓ ఆసుపత్రిలో యువకుడు చికిత్స పొందుతున్నాడనే ప్రచారం విస్తృతంగా జరుగుతోంది. అయితే ఇది కేవలం పుకార్లు మాత్రమేనని, ఇందులో ఎలాంటి వాస్తవం లేదని అధికారులు చెబుతున్నారు. కొందరైతే సోషల్ మీడియాలో దెయ్యానికి సంబంధించిన అంశాన్ని విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.
దీంతో స్థానికులు భయాందోళన చెందడంతో పాటు.. అటుగా వెళ్లాలంటే ఎవరైనా భయపడే పరిస్థితి నెలకొంది.ఈ క్రమంలో సోషల్ మీడియాలో దెయ్యాల పేరిట ఎవరైనా పుకార్లు వ్యాప్తి చేసినా, అసత్య ప్రచారం చేసినా చర్యలు తప్పవని అధికారులు హెచ్చరిస్తున్నారు. గతంలోనూ దెయ్యం సంచరిస్తుందనే వార్తలు వచ్చాయి. అయినప్పటికీ ఎక్కడా దెయ్యాలు సంచరిస్తున్నాయడానికి ఆధారాలు లభించకపోవడంతో అధికారులు వీటిని పుకార్లుగానే చూస్తున్నారు.