ఏపీ ఫైబర్ నెట్ కార్పొరేషన్ చైర్మన్ జీవీరెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఫైబర్ నెట్ నుంచి 410 మందిని తొలగించారు. వైసీపీ హయాంలో అక్రమ నియామకాలు చేపట్టినట్లు ఆయన వెల్లడించారు. వైసీపీ నేతల సిఫార్సులతో అడ్డగోలు నియామకాలు చేపట్టారని.. ఎక్కువ మంది అవసరం లేకున్నా నియమించారని ఆయన స్పష్టం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా నియామకాలు జరిగాయని తొలగించినట్లు ఆయన తెలిపారు.