తిరుమల అన్నమయ్య భవన్ లో 6 గంటల పాటు సుదీర్ఘంగా సాగిన టీటీడీ పాలకమండలి సమావేశం ముగిసింది. పాలకమండలి నిర్ణయాలను టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు మీడియాకు వివరించారు. సాధారణ భక్తులకు తక్కువ సమయంలో శ్రీవారి దర్శనం కలిగించేలా ఏఐ టెక్నాలజీ సాయం తీసుకోవడంపై కసరత్తు చేస్తున్నామని, ఏఐ టెక్నాలజీ అందించే పలు విదేశీ కంపెనీల డెమోలను పరిశీలిస్తున్నామని చెప్పారు. ఇవాళ కూడా రెండు కంపెనీల ప్రజంటేషన్ ను పరిశీలించామని, మిగతా కంపెనీల కాన్సెప్టులను కూడా పరిశీలించి మరో రెండు మూడు నెలల్లో సౌలభ్యమైన విధానాన్ని అమలు చేస్తామని బీఆర్ నాయుడు వివరించారు. ఇక, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచనల మేరకు ఈ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నామని తెలిపారు.