ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హోమోసెక్సువల్ సీరియల్ కిల్లర్.. 18 నెలల్లో 11 మంది పురుషుల హత్య

Crime |  Suryaa Desk  | Published : Tue, Dec 24, 2024, 08:00 PM

33 ఏళ్ల వయసు కల్గిన ఆ వ్యక్తికి పెళ్లై ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. అయితే అతడో హోమోసెక్సువల్. ఈ విషయం గుర్తించిన భార్య పిల్లలను తీసుకుని ఇంటి నుంచి వెళ్లిపోయింది. అప్పటి నుంచి పురుషులతో శారీరకంగా కలుస్తూ వారి వద్ద నుంచి డబ్బులు తీసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు నిందితుడు. ఇదంతా బాగానే ఉన్న ఇటీవలే ఓ హత్య చేసి పోలీసులకు చిక్కాడీ నేరగాడు. అయితే విచారణలో భాగంగా తాను మరో 10 మందిని హత్య చేసినట్లు చెప్పాడు. ఇలా ఈ సీరియల్ కిల్లర్ మొత్తం కథ తెలుసుకున్న పోలీసులు.. బాధితుల మృతదేహాలను వెతికే పనిలో పడ్డారు.


పంజాబ్‌లోని హోషియాపూర్ జిల్లా గర్హశంకర్ చౌరా గ్రామానికి చెందిన 33 ఏళ్ల రామ్ సరూప్ అలియాస్ సోధికి ఇప్పటికే పెళ్లి అయింది. భార్యతో పాటు ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. అయితే రామ్ సరూప్ ఓ హోమోసెక్సువల్. రెండేళ్ల క్రితం ఆ విషయం తెలుసుకున్న ఆయన భార్య.. పిల్లలను తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది. అక్కడే పని చేసుకుంటూ జీవనం సాగిస్తుంది. అయితే భార్య వెళ్లిపోయిన దగ్గర నుంచి రామ్ సరూప్.. ఒంటరిగా ఉంటున్నాడు.


ఈక్రమంలోనే పురుషులతో శారీరక సంబంధాలు నడుపుతూ.. వారి వద్ద నుంచి డబ్బులు తీసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అయితే ఈయన అడిగినంత డబ్బు వాళ్లు ఇవ్వకపోయినా, ఏదైనా గొడవ పెట్టుకున్న వెంటనే రామ్ సరూప్‌కి కోపం వచ్చేస్తుంది. దీంతో వెనకా ముందూ ఆలోచించకుండా.. తన దగ్గర ఉన్న చిన్న పదునైన గుడ్డతో వారి ప్రాణాలు తీసేవాడు. అది దొరకని పక్షంలో పక్కనే ఉన్న బండరాల్లు, ఇటుకలు వంటి వాటితో తలపై బాది చంపేవాడు. ఆపై తనకు ఏం తెలియదన్నట్లుగా అక్కడి నుంచి వెళ్లిపోయేవాడు. ఇలా ఇప్పటి వరకు మొత్తం 11 మంది పురుషులను హత్య చేశాడు.


అయితే ఇటీవలే ఓ వ్యక్తి హత్య కేసులో భాగంగా.. పోలీసులు రామ్ సరూప్‌ను పట్టుకున్నారు రోపర్ పోలీసులు. ఈక్రమంలోనే అతడిని ఎందుకు, ఎలా చంపావని తమదైన స్టైల్‌లో విచారించగా.. నిందితుడు అసలు విషయం చెప్పాడు. కేవలం ఆ ఒక్కడినే కాకుండా మరో 10 మందిని కూడా చంపినట్లు వివరించాడు. అయితే వారి జాబితాను పోలీసులకు చెప్పగా.. అందులో ఐదు కేసులను పోలీసులు చేధించారు.


అందులో మూడు హత్యలు రోపర్‌లోనే జరగ్గా, ఫతేఘర్ సాహిబ్, హోషియాపూర్‌ జిల్లాల్లో ఒక్కో హత్య జరిగినట్లు గుర్తించారు. ముఖ్యంగా రోపర్‌లో జరిగిన హత్యల్లో ఒక బాధితుడే 37 ఏళ్ల మణిందర్ సింగ్. మోడ్రన్ టోల్ ప్లాజా వద్ద టీ అమ్ముకునే ఇతడిని ఆగస్టు 18వ తేదీన రామ్ సరూప్ హత్య చేశాడు. ఆపై మనాలి రోడ్డులోని పెట్రోల్ పంపు ముందు ఉన్న పొదల్లో మృతదేహాన్ని పడేయగా.. పోలీసులు దాన్ని గుర్తించారు. అలాగే మరో బాధితుడు 34 ఏళ్ల ముకందర్ సింగ్ బిల్లాగా పోలీసులు గుర్తించారు. బేగంపూరాకు చెందిన ఈయన ట్రాక్టర్ రిపేర్ పనులు చేసుకుంటూ జీవనం సాగించేవాడని.. అతడిని ఏప్రిల్ 5వ తేదీన చంపేయగా.. మృతదేహం బర్హాపిండ్‌లోని పంజెహ్రా రోడ్‌లో లభ్యమైనట్లు చెప్పారు.


మరో మూడు కేసుల్లో బాధితుల మృతదేహాలను కూడా కనుక్కొని మరీ.. వారి కుటుంబ సభ్యులకు విషయం తెలియజేశారు రోపర్ పోలీసులు. అయితే మరో ఆరు కేసులు మాత్రం ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి. అయితే ఆ కేసులను కూడా త్వరలోనే ఛేదిస్తామని రోపర్ పోలీసులు వివరిస్తున్నారు. అలాగే నిందితుడు రామ్ సరూప్‌కు హెచ్ఐవీ సోకిందా లేదా అని పరీక్షలు చేస్తున్నట్లు కూడా చెప్పుకొచ్చారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com