డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ ను పార్లమెంటులో అవమానించిన కేంద్రమంత్రి అమిత్ షా క్షమాపణలు చెప్పి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం బాపట్ల పట్టణంలో బిఎస్పి ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన జరిగింది.
అనంతరం బీఎస్పీ ఏపీ అధ్యక్షులు బి. పరంజ్యోతి ఆ పార్టీ నాయకులతో కలిసి జిల్లా కలెక్టర్ వెంకట మురళికి వినతిపత్రం అందజేశారు. వినతి పత్రాన్ని రాష్ట్రపతికి పంపి అమిత్ షాపై చర్యలు తీసుకోవాలని కోరారు.