మెల్‌బోర్న్‌లో బాక్సింగ్ డే టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ మరోసారి తక్కువ స్కోరుకే ఔట్ అయ్యాడు.దీంతో అభిమానులు తమ నిరాశను వ్యక్తం చేస్తున్నారు. భారత ఇన్నింగ్స్ రెండో ఓవర్‌లో రోహిత్ 3 పరుగుల వద్ద ఔటయ్యాడు. టెస్టు మ్యాచ్‌లో 2వ రోజు లూజ్ షాట్‌కు ఔట్ కావడంతో ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. దీంతో రోహిత్ ఆడేందుకు ఆసక్తి చూపడం లేదంటూ కామెంట్లు చేస్తున్నారు. మొత్తంగా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఇప్పటి వరకు 5 ఇన్నింగ్స్‌లు ఆడిన రోహిత్ శర్మ కేవలం 22 పరుగులు మాత్రమే చేశాడు.బ్యాట్‌తో పేలవమైన ఫామ్ కొనసాగిస్తోన్న రోహిత్ శర్మ.. బ్యాటింగ్ ఆర్డర్‌లో ఓపెనర్‌గా తిరిగి రావడం కూడా కలిసి రాలేదు. పాట్ కమ్మిన్స్ వేసిన డెలివరీకి రోహిత్ హాఫ్-పుల్ ఆడాడు. అది షార్ట్ పిచ్‌గా మారింది.భారత కెప్టెన్ ఈ సిరీస్‌లో ఇప్పటివరకు 5 ఇన్నింగ్స్‌లలో 3, 6, 10, 3 స్కోర్‌లతో 22 పరుగులు మాత్రమే చేయగలిగాడు. రోహిత్ షాట్‌లో విశ్వాసం లేకపోవడం కనిపిస్తోంది. ముఖ్యంగా మిడిల్ ఆర్డర్‌లోకి దిగిన అడిలైడ్, బ్రిస్బేన్‌లలో బ్యాట్‌తో ఘోరంగా విఫలమయ్యాడు. దీంతో రోహిత్ శర్మ టెస్ట్ ఫార్మాట్ ఆడడంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.