తెలుగు తేజం నితీశ్ కుమార్ రెడ్డి మరోసారి సత్తా చాటాడు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా మెల్‌బోర్న్‌లోని ప్రతిష్ఠాత్మక ఎంసీజీ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్ట్ మ్యాచ్‌లో శతకం సాధించాడు. భారత జట్టు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో 176 బంతులు ఎదుర్కొని 105 పరుగులు సాధించాడు. ఇందులో 10 ఫోర్లు, 1 సిక్సర్ ఉన్నాయి. స్కాట్ బోలాండ్ ఓవర్‌లో బౌండరీ కొట్టి తనదైన శైలిలో శతకం పూర్తి చేసుకున్నాడు.అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్‌లో నితీశ్ కుమార్ రెడ్డికి ఇదే తొలి సెంచరీ కావడంతో టీమిండియా ఆటగాళ్లు స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చారు. కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, ఇతర ప్లేయర్లు అందరూ నిలబడి చప్పట్లు కొట్టారు. ఈ యువ ఆల్‌రౌండర్‌ను అభినందిస్తూ స్టేడియంలోని ప్రేక్షకులు కూడా చప్పట్లు కొట్టారు. టీమిండియా తీవ్ర కష్టాల్లో ఉన్న సమయంలో ఆడిన ఈ ఇన్నింగ్స్‌పై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది.అద్భుతమైన ఈ ఇన్నింగ్స్‌తో ఆస్ట్రేలియా గడ్డపై సెంచరీ నమోదు చేసిన అతిపిన్న భారత క్రికెటర్లలో ఒకడిగా నితీశ్ కుమార్ రెడ్డి నిలిచాడు. 21 సంవత్సరాల 216 రోజుల వయసులో నితీశ్ శతకం నమోదయింది. అతడి కంటే ముందు సచిన్ టెండూల్కర్ (18 ఏళ్ల 256 రోజులు), రిషబ్ పంత్ (21 సంవత్సరాల 92 రోజులు) ఉన్నారు.