BGT సిరీస్‌లో భాగంగా ఆసీస్‌తో జరుగుతున్న 4వ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీతో రాణించిన నితీశ్‌ను ఏపీ మంత్రి నారా లోకేశ్ ప్రశంసించారు. తెలుగుబిడ్డగా తాను ఎంతో గర్వపడుతున్నానని తెలిపారు.
‘నితీశ్ మీ ప్రతీ పరుగు, మాకు ఎంతో సంతోషం’ అని లోకేశ్ తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు. ఆసీస్ గడ్డపై దిగ్గజ ఆటగాళ్లతో సమానంగా సత్తాను ప్రదర్శించారని నితీశ్‌ను కొనియడారు.