టీమిండియా యువ ఆల్‌రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి సెంచరీతో చెలరేగాడు. ఐదు టెస్ట్‌ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్ట్‌లో ఈ తెలుగు కుర్రాడు శతకంతో టీమిండియాను ఆదుకున్నాడు. మెల్ బోర్న్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ మూడో రోజు ఆటలో అనేక నాటకీయ పరిణామాల మధ్య సినిమాటిక్ తరహాలో స్కాట్ బోలాండ్ బౌలింగ్‌లో లాంగాన్ దిశగా బౌండరీ బాది సెంచరీ మార్క్ అందుకున్నాడు.
221 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న భారత జట్టును నితీష్ సంచలన బ్యాటింగ్‌తో ఆదుకున్నాడు. వాషింగ్టన్ సుందర్(160 బంతుల్లో ఒక్క ఫోర్‌తో 50) కలిసి 8వ వికెట్‌కు 127 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పి టీమిండియాకు ఫాలో ఆన్ గండాన్ని తప్పించాడు. సుందర్, జస్‌ప్రీత్ బుమ్రా ఔటైనా.. సిరాజ్ సాయంతో సెంచరీ మార్క్ అందుకొని తన కలను సాకారం చేసుకున్నాడు.
ఆసీస్ గడ్డపై శతకం సాధించిన ఈ తెలుగోడిపై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది. అయితే కొందరు అభిమానులు మాత్రం అతని కులం, అభిమానంపై చర్చకు తెరలేపారు. ఏళ్లు గడుస్తున్నా మనషులకు ఈ కుల జాడ్యం వీడటం లేదనే విషయాన్ని మరోసారి నిరూపించారు.
నితీష్ కుమార్ రెడ్డి అసలు రెడ్డి కాదని సోషల్ మీడియా వేదికగా పోస్ట్‌లు పెడుతున్నారు. దాంతో రెడ్డి సామాజిక వర్గానికి చెందినవాడని సంబరపడినవారు నిరుత్సాహానికి గురవుతున్నారు. మరికొందరు మాత్రం నితీష్ కుమార్ రెడ్డి అసలు రెడ్డినేనని, అతని తాత తమకు తెలుసంటూ కామెంట్ చేస్తున్నారు.
అసలు రెడ్డి కాదు..?
నితీష్ కుమార్ రెడ్డి మత్స్యకార జాతికి సంబంధించిన రెడ్డిగ/రెడ్డిక అనే సామాజిక వర్గానికి చెందిన వాడని సోషల్ మీడియా వేదికగా ప్రచారం జరుగుతోంది. ఉత్తరాంధ్ర.. ముఖ్యంగా విశాఖ జిల్లాలో ఈ రెడ్డిక సామాజిక వర్గం ఎక్కువగా ఉంటుందంట. కేంద్ర ప్రభుత్వం వీరిని ఎంబీసీలుగా గుర్తించినట్లు తెలుస్తోంది. అయితే అత్యంత వెనుకబడిన సామాజిక వర్గం నుంచి వచ్చి.. జాతీయ జట్టులో స్థానం సంపాదించడం మామూలు విషయం కాదని, నితీష్ ఇక నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలని హితవు పలుకుతున్నారు. అతనికి వీసా లేకపోవడంతో తనుష్ కోటియన్‌ను తీసుకున్నాం: రోహిత్ శర్మ "అతనికి వీసా లేకపోవడంతో తనుష్ కోటియన్‌ను తీసుకున్నాం: రోహిత్ శర్మ "
ముంబైకి చెందిన సునీల్ గవాస్కర్, సంజయ్ మంజ్రేకర్‌లు ఇప్పటికే నితీష్ కుమార్ రెడ్డిపై విమర్శలు గుప్పిస్తున్నారని,
భవిష్యత్‌లో అతన్ని తొక్కేసే ప్రయత్నాలు జరుగుతాయని హెచ్చరిస్తున్నారు. కామెంటేటర్లుగా నితీష్ ఆటను విశ్లేషించే తీరే ఇందుకు నిదర్శనమని కామెంట్ చేస్తున్నారు.
సినిమా పిచ్చి కూడా..
ఓవైపు కులం గురించి చర్చ జరుగుతుంటే.. మరోవైపు సినీ ఫ్యాన్స్ మధ్య మరో ఘర్షణ నెలకొంది. నితీష్ కుమార్ రెడ్డి ఓ ఇంటర్వ్యూలో తన ఫేవరేట్ హీరో మహేశ్ బాబు అని చెప్పాడు. దాంతో మహేష్ ఫ్యాన్స్ నితీష్ తమ వాడేనని కామెంట్ చేస్తుంటే.. అతని పవన్ కళ్యాణ్ ఇష్టమని ఆ హీరో ఫ్యాన్స్ వాగ్వాదానికి దిగుతున్నారు. మరోవైపు నితీష్ కుమార్ రెడ్డి తండ్రి ముత్యాల రెడ్డి బాలయ్యకు వీరాభిమానని అతని ఫ్యాన్స్ పోస్ట్‌లు పెడుతున్నారు. సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న ఈ చర్చను చూసి కొందరు నెటిజన్లు అసహ్యించుకుంటున్నారు.
మీ కుల జాడ్యం, సినిమా పిచ్చితో ఎంతకు తెగించార్రా? అని మండిపడుతున్నారు. నితీష్ కుమార్ రెడ్డి టీమిండియా క్రికెటర్ అని, దేశం కోసం ఆడుతున్నాడని చురకలు అంటిస్తున్నారు. క్రికెటర్లలో కూడా కులం వెతకడం ఏంట్రా? అని మండిపడుతున్నారు. రోహిత్.. నీ స్వార్థం కోసం అతన్ని డిస్టర్బ్ చేశావ్: సంజయ్ మంజ్రేకర్"రోహిత్.. నీ స్వార్థం కోసం అతన్ని డిస్టర్బ్ చేశావ్: సంజయ్ మంజ్రేకర్"