టీమిండియా స్టార్ పేసర్, తెలంగాణ డీఎస్పీ మహమ్మద్ సిరాజ్‌కు పేస్ ఆల్‌రౌండర్, మెల్‌బోర్న్ సెంచరీ హీరో నితీష్ కుమార్ రెడ్డి ధన్యవాదాలు తెలిపాడు. సెంచరీకి అండగా నిలిచిందుకు ఇన్‌స్టా వేదికగా స్పెషల్ థ్యాంక్స్ చెప్పాడు. ఐదు టెస్ట్‌ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్ట్‌లో నితీష్ కుమార్ రెడ్డి అసాధారణ బ్యాటింగ్‌తో అరంగేట్ర శతకాన్ని అందుకున్నాడు. మెల్‌బోర్న్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో 8వ స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన నితీష్ కుమార్ రెడ్డి సంచలన బ్యాటింగ్‌తో టీమిండియాను గట్టెక్కించడమే కాకుండా శతకాన్ని సాధించాడు.
162 బంతులు.. ఒకే ఒక్క ఫోర్.. నీ జిడ్డు బ్యాటింగ్‌కు దండం సామీ!"162 బంతులు.. ఒకే ఒక్క ఫోర్.. నీ జిడ్డు బ్యాటింగ్‌కు దండం సామీ!"
రిషభ్ పంత్ ఔటైన అనంతరం క్లిష్ట పరిస్థితుల్లో బ్యాటింగ్‌కు వచ్చిన నితీష్ కుమార్ రెడ్డి.. జడేజా వెనుదిరిగినా వాషింగ్టన్ సుందర్‌తో కలిసి 8వ వికెట్ 127 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని అందించాడు. హాఫ్ సెంచరీతో నితీష్‌కు అండగా నిలిచిన సుందర్‌ను నాథన్ లయన్.. అనూహ్య బౌన్స్‌తో స్లిప్ క్యాచ్‌గా పెవిలియన్ చేర్చాడు.
సుందర్ ఔటయ్యే సమయానికి నితీష్ 96 పరుగులతో క్రీజులో ఉన్నాడు. బుమ్రా బ్యాటింగ్‌కు రాగా నితీష్ మరో మూడు పరుగులు చేసి 99వ నిలిచాడు. స్ట్రైకింగ్ తీసుకున్న బుమ్రా.. కమిన్స్ బౌలింగ్‌లో మూడు బంతులాడి వెనుదిరిగాడు. దాంతో నితీష్ కుమార్ రెడ్డి శతకంపై ఉత్కంఠ నెలకొంది. కానీ ఆఖరి వికెట్‌గా బ్యాటింగ్‌కు వచ్చిన సిరాజ్.. కమిన్స్ వేసిన మూడు బంతులను అద్భుతంగా డిఫెన్స్ చేసి నితీష్ కుమార్ రెడ్డికి స్ట్రైక్ ఇచ్చాడు. బుమ్రా బ్యాటింగ్ సమయంలో నితీష్ తండ్రి ముత్యాల రెడ్డి తీవ్రంగా టెన్షన్ పడ్డారు. పదే పదే ఆ దేవుడిని ప్రార్థించాడు.
స్కాట్ బోలాండ్ వేసిన మరుసటి ఓవర్‌లో నితీష్ రెండు బంతులు డిఫెన్స్ చేయడంతో ఉత్కంఠ తారా స్థాయికి చేరింది. మూడో బంతిని లాంగాన్ దిశగా బౌండరీ తరలించిన నితీష్.. సెంచరీ మార్క్ అందుకొని గర్జించాడు. సిరాజ్ సహకారం అందించకపోయి ఉంటే నితీష్ 99 పరుగుల వద్దే అజేయంగా నిలిచిపోయేవాడు. ఈ క్రమంలోనే సెంచరీ అనంతరం అతన్ని హగ్ చేసుకున్న ఫొటోను నితీష్ ఇన్‌స్టా వేదికగా పంచుకున్నాడు. 'నిన్ను నమ్మాను సిరాజ్ భాయ్'అనే క్యాప్షన్‌తో థ్యాంక్స్ చెప్పాడు. ఈ పోస్ట్‌కు సిరాజ్ కూడా స్పందించాడు. 'చాలా సంతోషంగా ఉంది. ఈ సెంచరీకి నువ్వు అర్హుడవి. అభినందనలు'అని బదులిచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్ట్‌లు నెట్టింట వైరల్‌గా మారాయి.