టీమిండియా యువ బ్యాటర్ నితీశ్ కుమార్ రెడ్డిపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘‘నువ్వు ‘భారత్’లోని ఏ ప్రాంతం నుంచి వచ్చావనే దాని కంటే దేశం గర్వించేలా ఏం చేశావన్నదే ముఖ్యం.
ఇలాంటి వరల్డ్ క్లాస్ రికార్డులెన్నో సాధించాలని కోరుకుంటున్నా. భారత జెండాను ఉన్నతస్థాయికి తీసుకెళ్లి ఎంతోమందికి స్ఫూర్తిగా నిలవాలి’’ అని నితీశ్‌ను ఉద్దేశించి ట్వీట్ చేశారు.