ప్రొ కబడ్డీ సీజన్-11వ సీజన్ విజేతగా హర్యానా స్టీలర్స్ జట్టు నిలిచింది. ఆదివారం రాత్రి పుణెలోని ఛత్రపతి స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో జరిగిన ఫైనల్‌లో మూడుసార్లు ఛాంపియన్ పట్నా పైరేట్స్‌ను ఓడించింది. 32-23 తేడాతో విజయం సాధించి ప్రొ కబడ్డీ లీగ్ టైటిల్‌ను తొలిసారి అందుకుంది. శివమ్ పటారే ఆల్‌రౌండ్ ప్రదర్శనతో హర్యానా ఘన విజయం సాధించింది.
ఫైనల్ మ్యాచ్‌లో ఓ దశలో ఇరు జట్లూ హోరాహోరీగా తలపడ్డాయి. గతేడాది ఫైనల్‌లో ఓడి రన్నరప్‌గా నిలిచిన హర్యానా స్టీలర్స్ ఈ సారి ఎలాగైనా టైటిల్ సాధించాలని పట్టుదలతో బరిలోకి దిగింది. అనుకున్నట్లుగానే ఆధిపత్యం ప్రదర్శించింది. ఓ దశలో ఫైనల్‌లో 7-7తో హర్యానా స్టీలర్స్, పట్నా పైరేట్స్ జట్లు సమంగా నిలిచాయి. కానీ ఆ తర్వాత హర్యానా ఆధిపత్యం ప్రదర్శించింది. శివమ్, రెజా, వినయ్‌లు వరుసగా పాయింట్లు సాధించడంతో పట్నాను ఆలౌట్ చేసి.. ఆధిక్యంలోకి వెళ్లింది. చివరకు 32-23తో టైటిల్ సాధించింది. ఈ సీజన్‌లో స్థిరంగా రాణిస్తూ.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది హర్యానా. చివరకు గత సీజన్‌లో మిస్ అయిన టైటిల్‌ను ఈసారి అందుకుంది.
ప్రో కబడ్డీ లీగ్ 11వ సీజన్‌లో విజేతగా నిలిచిన హర్యానా స్టీలర్స్ ట్రోఫీతో పాటు రూ.3 కోట్లను ఫ్రైజ్ మనీగా గెలుచుకుంది. రన్నరప్ పట్నా పైరేట్స్‌కు రూ.1.8 కోట్లు దక్కాయి.
ప్రొ కబడ్డీ లీగ్ విజేతలు జాబితా ఇదే..
సీజన్ 1: జైపూర్ పింక్ పాంథర్స్
సీజన్ 2: యూ ముంబా
సీజన్ 3: పట్నా పైరేట్స్
సీజన్ 4: పట్నా పైరేట్స్
సీజన్ 5: పట్నా పైరేట్స్
సీజన్ 6: బెంగళూరు బుల్స్
సీజన్ 7: బెంగాల్ వారియర్స్
సీజన్ 8: దబంగ్ ఢిల్లీ
సీజన్ 9: జైపూర్ పింక్ పాంథర్స్
సీజన్ 10: పుణెరి పల్టాన్
సీజన్ 11: హర్యానా స్టీలర్స్
ప్రొ కబడ్డీ లీగ్ రన్నరప్‌ల జాబితా ఇదే..
సీజన్ 1: యూ ముంబా
సీజన్ 2: బెంగళూరు బుల్స్
సీజన్ 3: యూ ముంబా
సీజన్ 4: జైపూర్ పింక్ పాంథర్స్
సీజన్ 5: గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్
సీజన్ 6: గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్
సీజన్ 7: దబంగ్ ఢిల్లీ
సీజన్ 8: పట్నా పైరేట్స్
సీజన్ 9: పుణెరి పల్టాన్
సీజన్ 10: హర్యానా స్టీలర్స్
సీజన్ 11: పట్నా పైరేట్స్