ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టాబ్లెట్స్ మీద రెడ్ లైన్ ఎందుకు ఉంటుందో తెలుసా...?

Life style |  Suryaa Desk  | Published : Sat, Jan 11, 2025, 11:37 AM

వాతావరణంలోని కలుషితం వల్ల కానీ చాలా మంది చిన్నతనంలోనే అనారోగ్యం బారిన పడుతున్నారు. అనేక రోగాలు తెచ్చుకొని మందులతో మెయింటైన్ చేస్తూ ఉన్నారు. పూర్వకాలంలో ఇలాంటి పరిస్థితి ఉండేది కాదు. అసలు టాబ్లెట్లు అనే విషయమే వారు ఎరుగరు. కానీ ప్రస్తుత ప్రాశ్చాత్య కాలంలో, ఎన్నో హాస్పిటల్, మెడికల్ షాపులు పడ్డాయంటే కారణం మన రోగాలు. ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ముందుగా మనం వైద్యుని సంప్రదించి టాబ్లెట్లు రాయించుకుంటాం.


డాక్టర్ రాసిన టాబ్లెట్ పై కొన్ని రకాల డిజైన్స్ ఉంటాయి. అవేంటో ఓ సారి తెలుసుకుందాం..? టాబ్లెట్ యొక్క క్యాప్సిల్స్ పైన రెడ్ కలర్ లైన్ ని మీరు చూసే ఉంటారు. కానీ దీని అర్థం చాలామందికి తెలియదు. ఈ లైన్ కి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. విషయంలోకి వెళితే..ఏ టాబ్లెట్ క్యాప్సిల్ పైన ఇలాంటి రెడ్ లైన్ వుంటుందో ఆ టాబ్లెట్స్ ని డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా తీసుకోకూడదని అర్థం. ఎందుకంటే ఇవి చాలా పవర్ ని కలిగి ఉంటాయి. డాక్టర్ సలహా ఉంటేనే వీటిని కొనుక్కోవాలి. ఫార్మసీ వాళ్ళు ఒకవేళ ఎలాంటి ప్రిస్క్రిప్షన్ లేకుండా ఇలాంటి రెడ్ లైన్ ఉన్న క్యాప్సిల్స్ ను గనుక మీకు ఇస్తే వాటిని తీసుకోకండి. ఒకవేళ తీసుకుంటే కనుక డాక్టర్ ని సంప్రదించి వాటిని వేసుకోండి. మామూలుగా అయితే ఏ ఫార్మసీ లో అయినా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా వెళితే ఇలాంటి మెడిసిన్స్ ని ఇవ్వరు. అలాగే టాబ్లెట్ల పైన లైన్ లను మీరు చూసే ఉంటారు. ఈ లైన్ వల్ల మీకు ఆ టాబ్లెట్ ఫుల్ డోస్ కావాలా లేక ఆఫ్ డోస్ సరిపోతుందా అనేది చూస్ చేసుకోవచ్చు. అంటే ఉదాహరణకు మీరు ఒక 500 మిల్లీగ్రాముల టాబ్లెట్ తీసుకున్నారనుకోండి. కానీ మీకు 250 మిల్లీగ్రాముల టాబ్లెట్ మాత్రమే అవసరమైనప్పుడు దాన్ని సగానికి విరిచి వేసుకోవచ్చు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com