బరువు తగ్గడానికి, కొన్ని ఆరోగ్యకరమైన అలవాట్లను అలవర్చుకోవాలి. ఈ అలవాట్లతో బరువు తగ్గవచ్చని నిపుణులు చెబుతున్నారు. మధ్యాహ్నం ముందు ఉదయం పూట కొన్ని పనులు చేయడం ద్వారా బరువు తగ్గించే ప్రయాణాన్ని సులభతరం చేసుకోవచ్చు. ఆ పనులేంటో ఇక్కడ తెలుసుకుందాం.
ఈ రోజుల్లో చాలా మంది ఆలస్యం నిద్రపోయి.. లేట్‌గా మేల్కొంటున్నారు. అయితే, ఇది ఎంత మాత్రం మంచి అలవాటు కాదు. రాత్రి త్వరగా నిద్రపోయి ఉదయాన్నే త్వరగా నిద్రలేవండి. ఉదయాన్నే నిద్రలేవడం వల్ల శరీరంలోని జీవక్రియ వేగవంతం అవుతుంది. ఇది కేలరీలను బర్న్ చేయడానికి సాయపడుతుంది. ఉదయాన్నే నిద్రలేవడం వల్ల మీరు యాక్టివ్‌గా ఉంటారు. అంతేకాకుండా వ్యాయామం లేదా యోగా వంటివి చేయడానికి మీకు టైమ్ దొరుకుతుంది.
బ్రేక్‌ఫాస్ట్
బ్రేక్‌ఫాస్ట్ అనేది రోజును ప్రారంభించడానికి అత్యంత కీలకం. అల్పాహారం తీసుకోవడం వల్ల రోజంతా మీరు యాక్టివ్‌గా ఉంటారు. మీకు తగిన శక్తి లభిస్తుంది. జీవక్రియ కూడా వేగవంతం అవుతుంది. బ్రేక్‌ఫాస్ట్‌లో ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకుంది. అల్పాహారంలో పండ్లు, పెరుగు, ఓట్స్ లేదా గుడ్లు వంటి సమతుల్య ఆహారాన్ని చేర్చుకోవచ్చు. బ్రేక్‌ఫాస్ట్ స్కిప్ చేయడం ఆరోగ్యానికి ఎంత మాత్రం మంచిది కాదు.
పుష్కలంగా నీరు తాగండి
శరీరానికి నీరు ఎంతో అవసరం. నీరు తాగడం వల్ల శరీరం యొక్క మెటబాలిజం వేగవంతం అవుతుంది. ఆకలి నియంత్రణలో ఉంటుంది. దీంతో తినాలనే కోరిక అదుపులో ఉంటుంది. ఉదయం నిద్ర లేచిన వెంటనే ఒక అరలీటరు నీరు అయినా తాగండి. అంతేకాకుండా రోజు మొత్తం తగినంత నీరు తాగాలని గుర్తించుకోండి. రోజుకు కనీసం 8 నుంచి 10 గ్లాసుల నీరు తాగండి.
వ్యాయామం
వ్యాయామం చేయడం వల్ల శరీరంలోని కేలరీలు కరిగిపోతాయి. బరువు తగ్గుతారు. చురుకైన నడక, యోగా, స్విమ్మింగ్ లేదా సైక్లింగ్ వంటి తేలికపాటి వ్యాయామం చేయడం వల్ల బరువు తగ్గే అవకాశం ఉంది. వ్యాయామం చేసేటప్పుడు శరీరంలో ఎండార్ఫిన్ల స్థాయిలు పెరుగుతాయి. ఇది ఆనందాన్ని పెంచి.. ఒత్తిడిని తగ్గిస్తుంది. ఒత్తిడి కూడా బరువు పెరగడానికి ఒక కారణం.
ఆరోగ్యకరమైన ఆహారం తినండి
మధ్యాహ్న భోజనంలో ఇంట్లో తయారుచేసిన, పోషకాలతో కూడిన ఆహారాన్ని తినండి. మధ్యాహ్న భోజనంలో పండ్లు, కూరగాయలు, పప్పులు, ధాన్యాలు చేర్చండి. ఆయిల్, స్పైసీ ఫుడ్, వేయించిన ఆహారాలకు దూరంగా ఉండండి. జంక్ ఫుడ్స్, మసాలా ఆహారాలు తినడం మానుకోండి.
బరువు తగ్గడానికి మరికొన్ని చిట్కాలు
* నెమ్మదిగా తినండి, పూర్తిగా నమలడానికి ప్రయత్నించండి.
* భోజనం చేసేటప్పుడు టీవీ, మొబైల్ చూడవద్దు. బుద్ధిగా తినండి.
* రాత్రి నిద్రించడానికి 2-3 గంటల ముందు ఆహారం తిని, ఆ తర్వాత కొంతసేపు నడవండి.
* ఒత్తిడికి దూరంగా ఉండండి.
* ప్రతిరోజూ 7-8 గంటల నిద్ర ముఖ్యం. రాత్రి త్వరగా నిద్రపోయి, ఉదయాన్నే త్వరగా నిద్రలేవండి.
ఈ విషయాలను గుర్తుంచుకోండి
* బరువు తగ్గడానికి సమయం పడుతుంది, కాబట్టి ఓపికపట్టండి.
* ఆరోగ్యకరమైన మార్గంలో బరువు తగ్గండి, త్వరగా బరువు తగ్గే ప్రయత్నంలో మీ ఆరోగ్యానికి హాని కలిగించవద్దు.
* మీకు ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉంటే, బరువు తగ్గడానికి ముందు మీ వైద్యుడిని సంప్రదించండి.