ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మొండి మరకలతో పాటు కంపుని పొగొట్టే క్లీనర్, ఇంట్లోనే సులభంగా

Life style |  Suryaa Desk  | Published : Fri, Jan 31, 2025, 11:44 PM

ఇల్లు పరిశుభ్రంగా ఉంటేనే ఆరోగ్యం. అయితే చాలా మంది ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకుంటారు. అయితే, బాత్రూమ్ విషయంలో అశ్రద్ధ చూపుతుంటారు. ఇంట్లో అన్నింటి కంటే ఎక్కువ శుభ్రంగా ఉంచుకోవాల్సింది బాత్రూమ్. అందులోని టాయిలెట్ సీట్ నీట్‌గా ఉండాలి. అయితే, ఒక్కోసారి టాయిలెట్ సీట్ మురికిగా మారిపోతుంది. ఎంతలా అంటే పసుపు పచ్చని మరకలు కనిపించేంత. అంతేకాకుండా టాయిలెట్ నుంచి వాసన కూడా వస్తుంది. ఇంట్లోకి బంధువులు, స్నేహితులు ఎవరైనా వచ్చి వీటిని చూస్తే అసహ్యించుకుంటారు.


ఒక్కోసారి క్లీన్ చేసినా ఆ మరకలు తొలగిపోవు. దుర్వాసన కూడా అలాగే ఉంటుంది. మార్కెట్లో కొన్ని ప్రొడక్ట్స్, లిక్విడ్స్ వాడినా ఫలితం ఉండదు. అందుకే టాయిలెట్ సీట్‌పై ఉన్న మొండి మరకలతో పాటు దుర్వాసనను పొగొట్టే క్లీనర్‌ను ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. అతి తక్కువ ఖర్చుతో టాయిలెట్ క్లీనర్ ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం.


టాయిలెట్ క్లీనర్ ఎలా తయారు చేసుకోవాలి?


​టాయిలెట్ సీట్‌పై ఉన్న మొండి మరకల్ని తొలగించుకోవడానికి ముందుగా ఒక కప్పులో బేకింగ్ సోడా, లిక్విడ్ డిటర్జెంట్ తీసుకోండి. ఫ్లోర్ ఫ్రెషనర్‌తో ఈ రెండింటిని బాగా కలపండి. ఇప్పుడు ఈ మిశ్రమంలో ఒక కప్పు వెనిగర్ వేసి బాగా మిక్స్ చేయండి. నురుగు లాంటి నీలి రంగు ద్రావణాన్ని తయారు చేయడానికి ఇప్పుడు కొంచెం నీరు కలపండి. ఈ లిక్విడ్‌ని ఒక బాటిల్‌లోకి తీసుకోండి.


ఇలా క్లీనింగ్ చేయండి


ఇంట్లో తయారుచేసిన క్లీనర్‌తో టాయిలెట్‌ను శుభ్రం చేయడానికి , ముందుగా ద్రవాన్ని పోసి, ఆపై బ్రష్ సహాయంతో టాయిలెట్ సీట్ మొత్తం అప్లై చేయండి. ఇప్పుడు దీన్ని కాసేపు అలాగే ఉంచి, ఆపై బ్రష్‌తో రుద్ది ఫ్లష్ చేసి శుభ్రం చేసుకోండి. ఇది కాంబోను పూర్తిగా శుభ్రం చేయడమే కాకుండా టాయిలెట్ యొక్క దుర్వాసనను కూడా తొలగించుకోవచ్చు.


టైల్స్, వాష్ బేసిన్ శుభ్రం చేయడం సులభం


ఈ లిక్విడ్ సాయంతో టాయిలెట్లోని మురికి పేరుకుపోయిన టైల్స్‌ని కూడా సులభంగా శుభ్రం చేయవచ్చు . ఇందుకోసం ఇంట్లో తయారు చేసిన లిక్విడ్ జోడించి బ్రష్‌తో రుద్దాలి. అదేవిధంగా మీరు వాష్ బేసిన్‌ను శుభ్రం చేయవచ్చు. ఆ తర్వాత నీటితో శుభ్రంగా క్లీన్ చేసుకోవచ్చు. ఈ లిక్విడ్ సాయంతో బాత్రూమ్‌ మూలల్లో పేరుకుపోయిన మురికి కూడా తొలగించుకోవచ్చు.


ఇది కూడా ట్రై చేయండి


​బాత్‌రూమ్‌లో పేరుకున్న మొండి మరకలు తొలగాలంటే.. కప్పు వైట్‌ వెనిగర్‌కి రెండు స్పూన్ల చొప్పున బ్లీచ్‌, బేకింగ్‌సోడా కలపాలి. ఈ మిశ్రమాన్ని స్ప్రే బాటిల్లో పోసి, స్నానాల గది గోడలు, నేల మీద చల్లి బ్రష్‌తో సమంగా పరచుకునేలా రుద్దాలి. గంటపాటు అలాగే వదిలేసి, ఆపై కొద్దిగా నీళ్లు పోస్తూ రుద్ది కడిగితే మొండి మరకలు పోతాయి. దుర్వాసన కూడా తొలగిపోతుంది.


బాత్రూమ్‌ని క్లీన్ చేసే ఇంకొన్ని చిట్కాలు


* ట్యాప్‌లు నీటి మరకలు పడి.. మురికిగా మారతాయి. వాటిని పూర్వ స్థితికి తీసుకురావడానికి.. డిష్‌వాష్‌ లిక్విడ్‌తో రుద్ది కడగండి. తర్వాత పొడి వస్త్రంపై పెట్రోల్‌ జెల్లీ రాసి దాంతో తుడిస్తే.. మెరుస్తాయి.


* స్నానాల గదిలో చేరిన మురికి, సబ్బు, షాంపూ తాలూకు వ్యర్థాలు టైల్స్‌, గోడల్ని అంటుకున్న మరకల్ని త్వరగా వదిలించాలి. లేదంటే మరింత బలంగా మారతాయి. క్రమంగా టైల్స్‌ పసుపు రంగులోకి మారతాయి. రోజూ అందరి స్నానాలూ పూర్తయ్యాక వెనిగర్‌ కలిపిన గోరువెచ్చని నీళ్లతో ఓ సారి రుద్ది కడిగేయండి. పాకుడు పట్టదు.


* బాత్‌రూమ్‌ సింక్‌లలో.. నీటి మరకలు, తెల్లటి మచ్చలు ఏర్పడతాయి. వీటిని తొలగించడం కాస్త కష్టంతో కూడుకున్న పనే. ఇవి తొలగించడానికి.. అరకప్పు చొప్పున నీరు, వెనిగర్‌ తీసుకొని కొద్దిగా వేడి చేయండి. ఈ మిశ్రమాన్ని మరకలున్న చోట రాయండి. పూర్తిగా ఆరాక నిమ్మ నూనెను చల్లి బ్రష్‌ లేదా కాగితపు ఉండతో రుద్ది కడిగేస్తే సరి.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com