ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మూడవసారి అధికారంలోకి వచ్చిన మొదటి పూర్తిస్థాయి బడ్జెట్ 2025 ఫిబ్రవరి 1, శనివారం నాడు పార్లమెంటులో సమర్పించారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా ఎనిమిదో సాధారణ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.ఈ బడ్జెట్‌లో సామాన్యుల నుంచి వ్యాపారుల వరకు ఎన్నో ఆశలు ఉన్నాయి. బడ్జెట్‌లో ఎలాంటి ప్రకటనలు ఉంటాయని ఎదురు చూస్తుండగా, ఉదయం 11 గంటలకు బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.దీంతో ఆమె 10 బడ్జెట్లు సమర్పించిన మొరాజీ దేశాయ్ రికార్డుకు చేరువైంది. మొరార్జీ దేశాయ్ ఆర్థిక మంత్రిగా 1959-1964 మధ్య ఆరు బడ్జెట్లు, 1967 -1969 మధ్య నాలుగు బడ్జెట్లు సమర్పించారు. వివిధ ప్రధాన మంత్రుల నాయకత్వంలో మాజీ ఆర్థిక మంత్రి పి చిదంబరం తొమ్మిది బడ్జెట్‌లను సమర్పించగా, ప్రణబ్ ముఖర్జీ ఎనిమిది బడ్జెట్‌లను ప్రవేశపెట్టారుఅయితే ఏకంగా ఎనిమిది బడ్జెట్‌లు ప్రవేశపెట్టిన రికార్డు మాత్రం నిర్మలా సీతారామన్ పేరిటే ఉంది. 2019లో మోదీ రెండోసారి పూర్తిస్థాయి ఆర్థిక మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. 2024లో మూడోసారి ఎన్‌డీఏ ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఈ మంత్రిత్వ శాఖ సీతారామన్ వద్దే ఉంది. దేశానికి రెండుసార్లు ప్రధానమంత్రిగా పనిచేసిన మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రిగా ప్రస్తుత భారతదేశ ఆర్థిక వ్యవస్థను మార్చిన ఘనత సాధించారు.