ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గురువారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఆసక్తికర నిర్ణయాలకు ఆమోదం తెలిపారు. ముఖ్యంగా నామినేటెడ్ పదవుల్లో బీసీలకు ఇకపై 34 శాతం రిజర్వేషన్‌కు మంత్రిమండలి ఆమోదం తెలిపింది.
ఈ నిర్ణయంతో బీసీలకు కీలక పదవులు దక్కే అవకాశం ఉంది. అలాగే సంక్షేమ పథకాల అమలు, ఎమ్మెల్సీ ఎన్నికలతో పాటుగా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణపైన మంత్రివర్గంలో చర్చించినట్లు తెలుస్తోంది.