ధర్మవరంలోని శ్రీ వివేకానంద డిగ్రీ కళాశాలలో గురువారం రోడ్డు భద్రతా వారోత్సవాలు నిర్వహించారు. రెండో పట్టణ సీఐ రెడ్డప్ప ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన కల్పించారు. బైక్ నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి, ప్రాణాలు కాపాడుకోవాలని సూచించారు.
కళాశాల విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఇందులో కే. అమృత సాయి, పీ. సౌమ్య, పీ. శ్రీహర్ష ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు సాధించారు.
![]() |
![]() |