కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓర్వకల్లు వద్ద ట్రాక్టర్ను కారు ఢీకొట్టడంతో కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మరణించగా మరో ఐదుగురికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. మృతులు జానకి(60), విహారిక (4)గా గుర్తించారు. ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.