బెంగళూరులోని మాగడి రోడ్డులోనిర్మాణంలో ఉన్న ఒక భవనంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు కార్మికులు మృతి చెందారు. కార్మికులు భవనంలో చెక్కపని చేస్తున్నారు. సిలిండర్ నుండి గ్యాస్ లీక్ కారణంగా మంటలు చెలరేగి భవనం పూర్తిగా దగ్ధమైంది. మరణించిన కార్మికులను ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఉదయ్ భాను (40), బీహార్‌కు చెందిన రోషన్ (23)గా గుర్తించారు. మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
![]() |
![]() |