AP: వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు శివారులో శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. పెన్నా వంతెన వద్ద ఆటోను బొలెరో వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు తీవ్రంగా గాయపడగా.. మరో 8 మంది మహిళలు స్వల్పంగా గాయపడ్డారు. ముద్దనూరు నుంచి పెద్దపసుపులకు మహిళా కూలీలతో ఆటో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను జమ్మలమడుగు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
![]() |
![]() |